Maa Telugu Talliki
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjO5-e5HqNoiwyJotSo9h5ls3dFJmgFoU4yv75JaxII6BKIpsoLB2jKWs5eEAk8OAcdVfZJ7SwPk1b55kzkbQBf5wWFQaLlixpyQTa-uwIL1VFmfOwVxioiy6TP7Vd6cK0BHhG-4F2nYnQ/s200/images.jpg)
మా తెలుగు తల్లికీ మల్లెపూదండ .... ......శంకరంభాడి మా తెలుగు తల్లికీ మల్లెపూదండ, మా కన్న తల్లికీ మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి అమరావతీ నగరి అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలిచి యుండేదాక రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక నీ ఆటలే ఆడుతాం - నీ పాటలే పాడుతాం జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!.......